Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతరకు ముస్తాబైన నాచారం మల్లన్న గుట్ట

జాతరకు ముస్తాబైన నాచారం మల్లన్న గుట్ట

- Advertisement -

మూడు రోజుల పాటు నిర్వహణ
నవతెలంగాణ – మల్హర్ రావు

ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిసర ప్రాంతంలోని మల్లన్నగుట్టపై మూడు రోజులపాటు శ్రీమ్సల్లిఖార్జున స్వామి ఉత్సవాలు జరుగనున్నాయి. గుట్టపై మల్లికార్జునస్వామిగా వెలిసి పూజలు అందుకుంటున్నాడు. మల్లికార్జుడిని కొలిచిన వారికి కొంగు బంగారంగా, కోరుకున్న కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా మల్లన్న గుట్టగా భక్తులు భావిస్తారు. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులు పాటు నిర్వహించే జాతరకు మండలంలోని గ్రామాలు, చుట్టు ప్రక్కల గ్రామాలు,ఇతర జిల్లాలకు చెందిన సందర్శకులు అధిక సంఖ్యలో స్వా మి వారిని దర్శిచుకొని మొక్కులు తీర్చుకుంటారు. 

ఆలయ చరిత్ర ఇలా.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో నివసిస్తున్న చేవూరి(దేవుని)మల్లయ్య పరమశిభక్తుడైన ఓ సాధారణ గొర్రెల కాపరి, రైతుకు 1972 సంవత్సరంలో మండలంలోని నాచారం గుట్టపై మల్లికార్జునస్వామి విగ్రహాలు ఉన్నాయి. వాటిని వెలికితీసి గుట్టపై ప్రతిష్ఠించి ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి రోజున పూజలు చేయమని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో భాగం నాచారంలోని మల్లన్న గుట్టగా తెల్లవారుజామున నాచారంలో దట్టమైన అడవులకు చేరుకొని కొద్ది రోజుల పాటు అన్వేషించారు.గస్తీతిరుగుతున్న సమయంలో నాచారం గ్రామ చెరువు సమీపంలో ఒక మనిషి రూపంలో దేవుడు వచ్చి విగ్రహాలను మల్లయ్యకు చూపించడంతో గుట్టపై ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు..
ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నాచారం మల్లన్న గుట్టలో మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాల జాతర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు చేవూరి దేవరాజు,శివకుమార్ చెబుతున్నారు. మొదటి రోజు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా శివరాత్రి కల్యాణ మహోత్సవం, గణపతి నవగ్ర హ, లక్ష్మి రుద్రహోమాలు, హనుమాన్ మూలమంత్ర హవనం, రెండో రోజు సోమవారం మల్లికార్జు స్వామి వారి రాత్రి పెద్దపట్నం, 3వ రోజు మంగళవారం నైవేద్యం, హారతి, కంకణోధ్యాసన, మహా దాశీర్వాదం, తీర్థప్రసాద వియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు.ఇప్పటికే జాతరకు సంబందించి అన్ని ఏర్పా ట్లను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.శివరాత్రి రోజున చుట్టు పక్కల గ్రామాలు, ఇతర మండలాల నుంచి గ్రామాలకు చెందిన భక్తులు ఎడ్లబండ్లతో, ఒగ్గు కథలతో పట్నాలు, బోనాలు చేస్తూ మల్లికార్జున స్వామిని ఆరాధిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -