Friday, February 13, 2026
E-PAPER
Homeఖమ్మంఓటు వేయడం రాని ఉద్యోగులు 

ఓటు వేయడం రాని ఉద్యోగులు 

- Advertisement -

మురిగిపోయిన పోస్టల్ బ్యాలెట్ 3 ఓట్లు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

నిరక్షరాస్యులు లకు ఓటు వేయడం రాలేదంటే ఏమో అవగాహన లేదేమో అనుకోవచ్చు.పెద్ద చదువులు చదివి,ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఓటు వేయడం రాలేదంటే ఏమనుకోవాలి. స్థానిక ఎన్నికల్లో ఒక్క ఓటు కీలకమే. అలాంటి ది ఓటు వేసే విధానం ఇంకా తెలియాలంటే బాధపడాల్సిన విషయమే. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో 27 మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్నారు.అయింది 27 ఓట్లు పోల్ అయినప్పటికీ 3 ఓట్లు ను (ఇన్వాలిడ్ )చెల్లని ఓట్లు గా నమోదు చేశారు.

కాంగ్రెస్ కు 16,బీఆర్ఎస్, సీపీఐ(ఎం) కు చెరో మూడు చొప్పున, స్వతంత్రులు ఇరువురికి చెరొకటి చోప్పున ఓట్లు పోల్ అయ్యాయి. 17 వ వార్డు జనరల్ (మహిళ) లో ముగ్గురు పోటీపడ్డారు. ఇందులో బీజేపీ అభ్యర్థి గుంట గీత శ్రీ కి 258, కాంగ్రెస్ అభ్యర్థి చారుగుండ్ల లక్ష్మి శైలజ కి 213, బీఆర్ఎస్ అభ్యర్థిని లింగిశెట్టి నాగదేవి కి 8 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ వార్డులో 3 బ్యాలెట్ ఓట్లు పోలైనప్పటికీ అవి చెల్లని ఓట్లు అయ్యాయి.

రెండో వార్డులో నమోదైన నాలుగు ఓట్లలో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1 చొప్పున వచ్చాయి. 9 వ వార్డు లో పోలైన ఒక ఓటు బీఆర్ఎస్ కు వచ్చింది. 10 వ వార్డు లో నమోదైన ఒక ఓటు కాంగ్రెస్ కు వచ్చింది. 11 వ వార్డు లో పోలైన ఒక ఓటు కాంగ్రెస్ కు పడింది. 14 వ వార్డు లో పోలైన 2 ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. 15 వ వార్డు లో పోలైన ఒక ఓటు బీఆర్ఎస్ కు పడింది. 18 వ వార్డు లో పోలైన 2 ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. 19 వ వార్డు లో పోలైన 3 ఓట్లు లో కాంగ్రెస్ కు 2, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పడ్డాయి.

20 వ వార్డు లో పోలైన ఒక ఓటు కాంగ్రెస్ కు వచ్చింది. 21 వ వార్డు లో పోలైన 4 ఓట్లు లో సీపీఐ(ఎం) కు 3, స్వతంత్ర అభ్యర్థి కి 1 వచ్చాయి. 22 వ వార్డు లో పోలైన 3 ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. వాస్తవానికి ఈ వార్డులో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి పోటీ చేసినా ఆయన కు పోస్టల్ బ్యాలెట్ ఓట్ పడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -