సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
చౌటుప్పల్ మున్సిపాలిటీలో 16వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి బత్తుల జయమ్మ దాసు కి జిల్లా పార్టీ పక్షాన అభినందనలు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో సామాన్యుడిగా ప్రజలందరి ఆదరాభిమానాలను చురుకుని క్రమశిక్షణ కలిగినటువంటి సీపీఐ(ఎం) కార్యకర్తగా బీఆర్ఎస్ మద్దతుతో ఘనవిజయాన్ని సాధించినటువంటి బత్తుల జయమ్మ దాసు కి సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో అభినందన కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
ఈ విజయాన్ని అందించినటువంటి 16 వార్డు ప్రజలకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన బలం విచ్చలివిడిగా మారి కులము మతము ఇతరుల పరలోభాలకు సైతం లెక్కచేయకుండా ఘనవిజయాన్ని అందించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లాలో చాలా చోట్ల సీపీఐ(ఎం) పోటీ చేసిందని, నిజాయితీగా ప్రజలందరి సీపీఐ(ఎం) నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలను ప్రజలకు వివరిస్తూ ఈ ఎన్నికల్లో రాజకీయ క్యాంపియన్ నిర్వహించడం జరిగిందనారు.
జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓటేసినటువంటి ప్రజలకు ధన్యవాదాలు భవిష్యత్తు కాలంలో ఎన్నికలు అనేటటువంటిది ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ సీపీఐ(ఎం) మరింత ఉత్సాహంగా ప్రజా సమస్యలపై పోరాటాన్ని చేస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే మాసాలని ప్రజా పోరాట మాసాలుగా మలిచి ప్రజా సమస్యలపై గ్రామీణ సమస్యలపై మహోద్యమాన్ని శ్రీకారం చుట్టుదామని ఎన్నికల్లో కొన్నిచోట్ల ప్రజలని విపరీతంగా మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. ఓటు విలువను గ్రహించినప్పుడే సరైన పాలన ప్రజలకు అందుతుంది భవిష్యత్తు కాలమంతా ప్రజలు సీపీఐ(ఎం) నిర్వహించే పోరాటాల్లో పాల్గొనాలని గెలిచిన అభ్యర్థుల ద్వారా ఆ రకంగా పదవిని పోరాట ఆయుధంగా మలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఎండి పాషా, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గోసికే కరుణాకర్, పి వై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, సీనియర్ నాయకులు బండారు నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు,నాయకులు మాతయ్య, సురేందర్, నందీశ్వర్, ఎండి సలీం, సుందర్, రాంబాబు లు పాల్గొన్నారు.



