Saturday, February 14, 2026
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ విజయం.. నాయకుల సంబరాలు

కాంగ్రెస్ విజయం.. నాయకుల సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లో 24 వార్డులకు 18 వార్డులు విజయం సాధించడంతో శుక్రవారం రాత్రి తిమ్మాజిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ప్రధాన అర్హదారిపై అంబేద్కర్ విగ్రహం సమీపంలో బాణాసంచాలు పేల్చి సీట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లు మైనార్టీ జిల్లా నాయకులు షేక్ ముబారక్ మార్కెట్ డైరెక్టర్ చెవ్వ మాధవులు అన్నారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బైరపాగరాజు, మీదింటి సురేందర్, కాకి నాగేష్, దానం బాలకృష్ణ, గోవింద నాయక్, సత్యం నాయక్, షేక్ బాబా తదితరులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -