Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భవిష్యత్తులో మరిన్ని సేవా అవార్డులు సొంతం చేసుకోవాలి

భవిష్యత్తులో మరిన్ని సేవా అవార్డులు సొంతం చేసుకోవాలి

- Advertisement -
  • – పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు 
  • నవతెలంగాణ-గోవిందరావుపేట 
  • గణపాక సుధాకర్ భవిష్యత్తులో మరిన్ని సేవా అవార్డులు సొంతం చేసుకోవాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు.  మంగళవారం మండల కేంద్రంలో దళిత రత్న అవార్డు గ్రహీత గణపాక సుధాకర్ ను అశోక్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము దళితులకు సామాజిక సేవ కార్యక్రమాలు చేసే దళిత సేవకులను గుర్తించి ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత రత్న అవార్డులను ప్రకటించడం జరుగుతుందనీ
  • అందులో భాగంగానే ఈ సంవత్సరము అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దళిత రత్న అవార్డులను ప్రకటించడం జరిగింది ఈ అవార్డు పొందిన వారిలో ఘనపాక సుధాకర్ ఒకరు అని అన్నారు.
  • దళిత సామాజిక వర్గానికి సుధాకర్ అన్న చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అదేవిధంగా సుధాకర్ అన్న మునుముందు అనేక సేవలు చేయాలని మనసారా కోరుకుంటున్నా ను సుధాకర్ అన్నకు భవిష్యత్తులో అనేక అవార్డులు రావాలని అదేవిధంగా అన్ని రంగాలలో ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారుఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యువజన నాయకులు ఘనపాక భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad