నవతెలంగాణ – ఆత్మకూరు
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పూజారి రాము తల్లి పూజారి మల్లికాంబ ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మల్లికాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే , కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టసుఖాల్లో కలిసి నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ భాష బోయిన పైడిద్ద,టౌన్ పార్టీ అధ్యక్షులు పాపాని రవీందర్ బీఆర్‌ఎస్ , మాజీ సర్పంచ్ రంపిసా మనోహర్,మండల నాయకులు, సాగర్, సుధాకర్, విశ్వేశ్వర రెడ్డి,కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



