Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్ పార్టీదే

ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్ పార్టీదే

- Advertisement -

మున్సిపల్ విజయోత్సవంపై ర్యాలీ
నవతెలంగాణ – మల్హర్ రావు

రాష్ట్రంలో ఎన్నికలు ఏవి జరిగినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. మొన్న జరిగిన జిపిల ఎన్నికల్లో, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ  సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రుద్రారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ళు, మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు అమలుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెట్టారని తెలిపారు. మోసపూరిత పార్టీలైన బిఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మక ఓటుతో బాంధపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -