Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంకాలుష్య కారకులే మెజారిటీ భారాన్ని మోయాలి !

కాలుష్య కారకులే మెజారిటీ భారాన్ని మోయాలి !

- Advertisement -

మ్యునిచ్‌ భద్రతా సమావేశంలో నిర్మలా సీతారామన్‌
మ్యునిచ్‌ : వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి దేశాల మధ్య విభిన్నమైన రీతిలో బాధ్యతల విభజన ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. కాలుష్యం ఎవరైతే సృష్టిస్తారో వారే చెల్లించాలనే సూత్రాన్ని ఇక్కడ అనుసరించాలన్నారు. మ్యునిచ్‌లో శనివారం జరిగిన ‘వాతావరణ భద్రత’ సమావేశంలో ఆమె ప్రసంగించారు. తీవ్ర స్థాయిలో కాలుష్య కారకాలకు కారణమయ్యే దేశాలు ఈ వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆందోళనలను పరిష్కరించడానికి ముందుకు రావాలని, ఆ భారంలో మెజారిటీ వాటాను భరించాలని కోరారు. కాలుష్య సంక్షోభానికి పెద్దగా కారణమవని దేశాలు కూడా సమానంగానే మూల్యం చెల్లించాలని కోరడం సరికాదన్నారు.

అలాగే సాంకేతిక సహకారం కూడా వుండాలన్నారు. వాతావరణ సంబంధిత సాంకేతికతలను వాణిజ్య ప్రాతిపదికన పంచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను ఆమె కోరారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ వాతావరణ సంబంధిత కార్యకలాపాలపై ఖర్చు ఎక్కువగా పెడుతోందని చెప్పారు. బయట నుంచి వచ్చే నిధుల కోసమో లేదా సాంకేతికత కోసమే వేచి చూడడం లేదన్నారు. ఒకవేళ అలాంటి సహకారం ఉంటే స్వాగతిస్తామన్నారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ఆందోళనలను పరిష్కరించని పక్షంలో పెద్ద సంఖ్యలో ప్రజలను, ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సత్వరమే కమ్యూనిటీలను, జీవనోపాధులను కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -