Sunday, February 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకరీంనగర్‌ పీఠం మాదే

కరీంనగర్‌ పీఠం మాదే

- Advertisement -

కుట్రలు చేస్తే తడాఖా చూపిస్తా : కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం బీజేపీదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి మేయర్‌ కాకుండా కుట్రలు చేస్తే తడాఖా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఎన్‌వీ సుభాష్‌, కళ్యాణ్‌నాయక్‌, రవినాయక్‌, అంతోనిరెడ్డి, సంగప్పతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఎమ్‌సిల్‌ బంధాన్ని ఏర్పరచుకున్నాయని ఎద్దేవా చేశారు. అది అక్రమబంధమని తెలిపారు. కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చిందన్నారు. కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ పార్టీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. అయినా సరే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటై తమకు మేయర్‌ పదవి దక్కకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు ఆ రెండు పార్టీలు రహస్యంగా చర్చించుకునేవి ఇప్పుడు బీజేపీని ఓడించేందుకు బహిరంగంగా చర్చించుకుంటున్నాయన్నారు. దీనికి జాతీయ నాయకత్వ ఆమోదం ఉందా? లేక స్థానికంగా చర్చించుకుంటున్నారా? బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చినప్పటికీ ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. అదే జరిగితే ఆ రెండు పార్టీల బండారం బయట పెడతానని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -