– ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలి
– పర్యాటక కేంద్రాలుగా ఆలయాలు : మంత్రి కోమటిరెడ్డి
– పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
– రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహాశివ రాత్రి సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పానగల్‌లోని చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పానగల్‌లోని పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని అన్నారు. సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు వల్ల ఎన్నో నిధులు వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వారసత్వ సంపదగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 11-12వ శతాబ్దంలో చోళులు ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని నిర్మించారన్నారు. పానగల్ సమీపంలో ఉన్న చందనపల్లి డంపింగ్ యార్డును త్వరలోనే ఇక్కడి నుంచి మరోచోటుకు తరలిస్తామని తెలిపారు. ఆయన వెంట నల్లగొండ ఆర్డీవో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జగదీశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, పానగల్ నాయకులు తదితరులు ఉన్నారు.
చారిత్రాత్మక ఆలయాల పరిరక్షణకు కేంద్రం నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



