– మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిక
నవతెలంగాణ -ఖమ్మం
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కార్పొరేటర్ సీరపు సుగుణ, 13వ డివిజన్ కార్పొరేటర్ తలుగు శాంత, 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్ దున్నపోతుల మణి, 48వ డివిజన్ కార్పొరేటర్ ధర్మసోత్ నరేష్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



