Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఘన నివాళి

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ 
స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగిందని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంగరి దయాకర్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 21 వ వర్ధంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని లౌకికవాది, స్వతంత్ర సమరయోధుడు, ప్రజా ఉద్యమకారుడిగా దేశానికి సేవలందించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు దేశానికి సుపరిపాలన అందించిన ఘనత నెహ్రూ కు దక్కిందన్నారు. ఆయన పాలనలో దేశంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపడుతూ అనేక సంస్కరణలు చేపట్టారు. నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తుడుం ప్రశాంత్, మండల కార్యదర్శి తుడుం ఇంద్రకరణ్, నాయకులు గుంటి నర్సింలు,దుర్గాప్రసాద్,యాదగిరి, కనకయ్య,ఎల్లం, బాబు, అశోక్ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -