కొద్దిమందిని బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, కండ్ల కింద డార్క్ సర్కిల్స్ లాంటి చర్మ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. చర్మరంధ్రాల్లో నూనె, మృతకణాలు, ధూళి చేరడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే ఫేస్ కాంతి రహితంగా కనిపిస్తుంది. మరి వీటిని తొలగించుకోవడమెలాగో, నిపుణులు చేస్తున్న సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
స్టీమ్ ట్రీట్‌మెంట్: బ్లాక్‌హెడ్స్ తొలగించడానికి ఈజీ పద్ధతిల్లో ఆవిరి పట్టడం ఒకటి. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరిపట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత తడి వస్త్రంతో మృదువుగా తుడిస్తే చర్మరంధ్రాల్లో పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్ బయటకు వస్తాయని వివరిస్తున్నారు.
తేనె స్క్రబ్: ఇందులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక టీస్పూన్ తేనె తీసుకుని అందులో కాస్త చక్కెర కలిపి ఫేస్‌కు అప్లై చేసుకున్న తర్వాత వేళ్లను తడుపుతూ మృదువుగా స్క్రబ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటు బ్లాక్ హెడ్స్‌నీ తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
బేకింగ్ సోడా: ఇది చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక టీస్పూను బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత ఫేస్‌ను సున్నితంగా వృత్తాకారంగా మసాజ్ చేసుకొని ఐదు నిమిషాల వరకు ఆరనివ్వాలి. అనంతరం ఫేస్‌ను నీటితో బాగా కడిగిన తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి. అయితే బేకింగ్ సోడాను వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచించారు. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే సహజంగా బ్లాక్‌హెడ్స్ సమస్య దూరమవుతుందని అంటున్నారు.
గ్రీన్‌టీ మాస్క్: గ్రీన్‌టీలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన గ్రీన్ టీ పొడిని ఫేస్‌కు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ మాస్క్ బ్లాక్‌హెడ్స్ తగ్గించడంతో పాటు చర్మానికి తాజాదనం ఇస్తుందంటున్నారు నిపుణులు. గ్రీన్‌టీ ఆకులు చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో చర్మం కాంతివంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.
బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా..?
- Advertisement -
- Advertisement -