Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు

అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు

- Advertisement -

కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరి కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ జోక్యం ఉండేలా జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి అంగన్‌వాడీలు వస్తాయనీ, ఉద్యోగులతో నమ్మకంగా, స్నేహంగా ఉంటేనే ప్రజలకు మంచి సేవలందు తాయని సూచించారు.

అంగన్‌వాడీలతో పిల్లలు, గర్భిణీల్లో పౌష్టికాహార లోపం సమస్య చాలా వరకు తగ్గిందని తెలిపారు. ఇప్పటికే చాలా పనులు చేస్తున్న అంగన్‌ వాడీ టీచర్లను అవమానిస్తూ, వారిపై పని ఒత్తిడి పెంచొద్దని ఆమె కోరారు. వారికి నెలల తరబడి జీతాలు ఆపడం సరికాదని పేర్కొన్నారు. అంగన్‌ వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, కాంట్రాక్ట్‌ వర్కర్లకు జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ హామీ మేరకు అంగన్‌ వాడీల జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -