నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జిల్లా స్థాయి సీఎం కప్ నెట్ బాల్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 17న తిర్మన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి నెట్ వాల్ పోటీల్లో కోన సముందర్ పాఠశాల విద్యార్థినిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు.
ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న డి.నిఖిత, బి.వెన్నెల సీఎం కప్ రాష్ట్ర స్థాయికి టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 19 నుండి 22 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో ఇద్దరు విద్యార్థినిలు పాల్గొంటారని తెలిపారు. పాఠశాల విద్యార్థినిలు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం పట్ల స్థానిక సర్పంచ్ బెజ్జారపు రాకేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.



