Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైళ్లలో ధూమపానం చేస్తే రూ.10 వేలు జరిమానా

రైళ్లలో ధూమపానం చేస్తే రూ.10 వేలు జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని ‘జన విశ్వాస్‌’ పేరుతో సవరించింది. టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతించిన దూరం కంటే ఎక్కువ ప్రయాణించడం, ఇతరుల టికెట్‌పై వెళ్లడం వంటి వాటికి ప్రయాణ ఛార్జీలతో పాటు రూ.500 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. అనధికారిక తినుబండారాల అమ్మకం, భిక్షాటన, రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం, అనధికారిక ప్రవేశం, సీటు ఖాళీ చేయడానికి నిరాకరించడం, మహిళల కోచ్‌లోకి పురుషుల ప్రవేశం, ప్రమాదకర వస్తువులు తీసుకురావడం, ధూమపానం వంటి నేరాలకు రూ.500 నుండి రూ.10 వేల వరకు జరిమానాలు విధించారు. జరిమానా చెల్లించని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -