Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రకృతి వ్యవసాయం, సహజ సాగుపై రైతులకు శిక్షణ

ప్రకృతి వ్యవసాయం, సహజ సాగుపై రైతులకు శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – వేల్పూర్ ఆర్మూర్ 
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారి బి రాజు ఆధ్వర్యంలో పకృతి వ్యవసాయం సహజసిద్ధంగా సేంద్రియ సాగుపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలో ఎన్ ఎం ఎఫ్ పథకం కింద 125 మంది రైతులు ,12500 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయానికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకంపై రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయు విధానం, వివిధ ప్రకృతి వ్యవసాయ సేంద్రియ పద్ధతులు రైతులకు ఈ పథకం ద్వారా అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీలు అవగాహన కల్పించడ జరిగింది.

రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పదార్థాలు ఉపయోగించి రైతులు సాగు చేసి నాణ్యమైన ఆరోగ్యపరమైన పంటల ఉత్పత్తులు సాధించి, భూమి సారవంతాన్ని పకృతిని కాపాడి వ్యవసాయం చేసి మంచి నాణ్యమైన దిగుబడులు సాధించాలని అన్నారు. భూసార పరీక్ష ఫలితాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ ,ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ,కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, ఏ ఈ ఓ స్నేహ శ్రీ ,సంపూర్ణ, సుస్థిర వ్యవసాయ కేంద్రం అధికారులు, గ్రామా రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -