Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడల్లో రాణించాలనే ప్రభుత్వ లక్ష్యం 

క్రీడల్లో రాణించాలనే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాణించాలని ఉద్దేశంతోనే మారుమూల గ్రామీణ ప్రాంతాల వారిని ప్రభుత్వం  క్రీడా పోటీలను నిర్వహించి, ప్రతిభావంతులను గుర్తింపు జరిగే విధంగా సిఎం కప్ 2025  రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై శనివారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతకుముందు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా గల క్రీడాకారులను క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. 

పల్లెల నుంచి రాష్ట్రస్థాయి సైకిల్ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి సుమారు 400 మంది విద్యార్థులు యువకులు పాల్గొన్నారన్నారు. మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఈ క్రీడలు రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ సౌందర్య, ఖేలో ఇండియా కోచ్ సంజీవ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ మంగారెడ్డి, సిద్దిపేట్ రూరల్ సి ఐ శ్రీను, చిన్నకోడూర్ఎస్ ఐ.చంద్రమోహన్, చంద్లాపూర్ సర్పంచ్ సురగొని శేఖర్, సైక్లింగ్ టెక్నికల్ టీం గా దత్తాత్రేయ, విజయ్ కాంత్ రావు, విజయభాస్కర్, అల్లాడి కృష్ణ, ధర్మ తేజ మాజీఎఫ్ సెక్రటరీ పాతూరి సుజాత, రామేశ్వర్ రెడ్డి, మాలతి, సువర్ణ లత, ఉప్పలయ్య, సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోచులు సైక్లిస్టులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -