Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో రెడ్ బుక్ డే

సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో రెడ్ బుక్ డే

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే పుస్తకం పై పుస్తక పఠనం చేసినట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ తెలిపారు. ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పత్రం కమ్యూనిస్టు ప్రణాళిక.1848 ఫిబ్రవరి మధ్య కమ్యూనిస్టు లీగ్‌ ఆదేశం మేరకు మార్క్స్‌, ఏంగెల్స్‌ దీన్ని రూపొందించారు. 1848 ఫిబ్రవరిలో అచ్చయ్యిందని,  అమెరికా సామ్రాజ్యవాదం రోజురోజుకు పెరిగిపోయి దేశాల మీద పన్నుల పేరుతో సుంకాలను విధించడం దేశాల అధికారాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని లక్ష్యంగా అమెరికా  బరితెగించడం రోజురోజుకు పెరిగిపోయిందనారు.

ఇరాన్ ఇరాక్ పై దాడి, గాజా పై దాడి, ఇజ్రాయిల్ పై దాడి, అనేక దేశాల మీద నేరుగా దాడి చేసి దేశాల మీద తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి చూస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యవాదులు మేధావులు వామపక్షవాదులు వ్యతిరేకించాలి, అనేక దేశాలు తమ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న తరుణంలో కమ్యూనిస్టు ప్రణాళిక ఆధారంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థలు సుస్థిరం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా ప్రజలు  పోరాటాలు చేయాలని కోరారు.

ఈ రెడ్ బుక్ డే కార్యక్రమంలో జర్నలిస్ట్ ఎస్ మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీనివాస చారి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు లావుడియా రాజు,పల్లెర్ల అంజయ్య, ఎదునూరి మల్లేష్, కొండమడుగు నాగమణి, గంధమల్ల మాతయ్య, సురుపంగా ప్రకాష్, బొల్లెపల్లి స్వామి, ఈర్ల రాహుల్, వోల్దాసు అంజయ్య, బోడ హనుమంతు, బోడ భాగ్య, వల్లభుదాసు రాంబాబు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -