- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని పాత రుద్రారంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జాడి తిరుపతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ పరమర్షించి ఓదార్చారు. ఈ సందర్భంగా 50 కిలోల సన్నబియ్యం బస్తా,రూ.2 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ఫు సభ్యులు జాడి అనసూయ, జాడి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల చంద్రమోహన్, చిగురు సదయ్య, ప్రభాకర్, నరేందర్, మహేందర్, జాడీ చిన్న రాజయ్య, మంతెన సూర్య కిరణ్ పాల్గొన్నారు.
- Advertisement -



