మహబూబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మునిగలవీడు గ్రామంలో నీరుడు ప్రమీలమ్మ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడు బిక్షం రెడ్డి ఆయన తల్లి నీరుడు ప్రమీలమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు అని తెలిపారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య , మదనతుర్తి మాజీ సర్పంచ్ వలబోజు వెంకటేశ్వర్లు, మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇసంపెల్లి వెంకటేష్, మాజీ సర్పంచ్ పట్నంశెట్టి నాగరాజు, నీరుడు అనంత రెడ్డి, బండ ఉపేందర్, బొల్లికొండ నాగరాజు ధర్మరాపు శ్రీకాంత్,దుస్స సుధాకర్ నిదానపల్లి ప్రవీణ్ తోపాటు కొంతమంది పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



