ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి
నవతెలంగాణ-నెల్లికుదురు
చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు. బుధవారం బంజారా అంగన్వాడీ పరిధిలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా కిషోర్ బాలికలకు, తల్లిదండ్రులను సమావేశపరిచి చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా మొబైల్ వాడకం గేమ్స్ బెట్టింగ్ అంశాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టాలని ఫోన్ వాడకాన్ని తగ్గించాలని ఎప్పటికప్పుడు వారి విషయాలను గమనించాలని బెట్టింగ్ పద్ధతి నేరమని పిల్లలకు అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులు చెప్పుకోవాలి సూచన చేసినట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్తుపై ఇవి పడకుండా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలని సూచించనైనది మొబైల్ వాడకం ఎంత ఉపయోగకరమో పిల్లల పట్ల అంతకంటే నష్టం ఎక్కువగా ఉంటుంది బయట ఆటలు వ్యాయామం లాంటి వాటిని అలవాటు చేసుకుని మొబైల్ వాడకం తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మైభమ్మ ఆయమ్మ లింగమ్మ కిశోర బాలికలు బాలురు యువజనలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



