నవతెలంగాణ-హైదరాబాద్ : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, హార్ముజ్ జల సంధి తెరుచుకోవడంపై అనిశ్చితి, ఉక్రెయిన్- రష్యా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండడం వంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో డాలర్ విలువ పుంజుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు ఒక్కసారిగా దిగివచ్చాయి. మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వెండి రేటు మాత్రం దిగిరాకుండా స్థిరంగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు గత రెండు రోజులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు మాత్రం ఒక్కసారిగా భారీగా తగ్గి ఊరట కల్పించాయి. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1260 మేర దిగివచ్చింది. దీంతో తులం రేటు రూ.1,53,600 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1150 మేర తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,800 వద్దకు దిగివచ్చింది.
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



