- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినిపై ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. విశ్రాంత ఉద్యోగుల బకాయిల విడుదలకు ఆమె కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అంబర్ పేట న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై పకడ్బందీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. నందిని రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారని, అయితే గతంలో ఎంపీ టికెట్ ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
- Advertisement -



