- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం, అలాగే తిరంగా ర్యాలీ నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పలు రోడ్లలో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. ముఖ్యంగా సెక్రటేరియేట్, ఐ-మాక్స్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగనుంది.
- Advertisement -


