Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయివేటు బస్సు బోల్తా..21 మందికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయివేటు బస్సు బోల్తా..21 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రయివేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న బస్సు భూత్పూర్ సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించి, బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -