నవతెలంగాణ-మల్హర్ రావు : వ్యవసాయ పొలంవద్ద మోటర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై కట్టెకొల బాపు (45), కట్టెకొల మనోజ్ (20), తండ్రి,కొడుకులు అక్కడికక్కడే మృతి చెందిన విషాధకరమైన సంఘటన కాటారం మండలం గంగారం గ్రామపరిదిలోగల మార్వాడీపల్లి శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం మండలంలోని కొండంపేట రెవెన్యూ గ్రామ శివారులో రోడ్డం వద్ద తమ వ్యవసాయ పొలంలో తండ్రి కొడుకులు శుక్రవారం ఉదమే విద్యుత్ మోటర్ మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు మొదట తండ్రికి విద్యుత్ షాక్ గురైన విషయం గమనించిన కొడుకు తండ్రని రక్షించబోయి కొడుకు సైతం విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. సంఘటన స్థలానికి కొయ్యుర్ పోలీసులు చేసురుకొని విచారణ చేపట్టారు.ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో గంగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వం ఆర్థికంగా రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విషాదం..కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


