Thursday, September 24, 2026
E-PAPER
Homeక్రైమ్పిడుగుపాటుకు 8 జీవాలు మృత్యువాత

పిడుగుపాటుకు 8 జీవాలు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ -ధన్వాడ
పిడుగుపాటుకు ఎనిమిది జీవాలు మృత్యువాత పడిన ఘటన నారాణపేట జిల్లా ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. బాధితుడు తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఏడు మేకలు, ఒక గొర్రె పోతు మృతి చెందాయి. దీంతో మొత్తం ఎనిమది జీవాలను కోల్పోయయని తెలిపారు. కిష్టాపూర్‌కు చెందిన రేగిచెట్టు తిరుపతి మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం అప్పు చేసి సుమారు 40 మేకలను కొనుగోలు చేశానన్నారు. రోజువారీగా మేకలను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం రావడంతో పిడుగు పడింది. పిడుగుపాటుతో జీవాలు చనిపోవడం వలన సుమారు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -