Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యాన శాఖను బలోపేతం చేయాలి

ఉద్యాన శాఖను బలోపేతం చేయాలి

- Advertisement -


రైతులకు మెరుగైన సేవలందించాలి : 
ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ
 డైరెక్టర్‌‌ యాస్మిన్‌‌భాషాకు టీజీ‌హెచ్‌ఓఏ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉద్యాన శాఖను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రావుల విద్యాసాగర్‌, కార్యదర్శి చింతల రోహిత్‌ డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌‌లో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ ‌యాస్మిన్‌ ‌భాషాకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ ‌సహాయ కార్యదర్శి పి.అనంతరెడ్డి, కోశాధికారి జలేందర్‌, హిమబిందు, రాకేశ్‌, సునీల్‌, మాధవి, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో ఉద్యాన అధికారి సుమారు 5 నుంచి 10 మండలాల వరకు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోందని డైరెక్టర్‌ యాస్మిన్‌‌భాషా దృష్టికి విద్యాసాగర్‌, రోహిత్‌ తీసుకెళ్లారు. ఒక అధికారి పరిధిలో విస్తృతమైన ప్రాంతం ఉండటంతో ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు అవసరమైన సాంకేతిక సలహాలు, పంటల పరిశీలన, పథకాల అమలు, ఉద్యాన పంటల విస్తరణ, రైతు శిక్షణలు వంటి సేవలను సకాలంలో అందించడం కష్టతర మవుతున్నదని వాపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ నీటి పారుదల కార్యక్రమానికి ప్రత్యేక పరిపాలనా, క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవస్థ ఉండగా, తెలంగాణలో ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారులపై ఉద్యాన పథకాలతో పాటు సూక్ష్మ నీటి పారుదల, ఆయిల్‌పామ్ తదితర కార్య క్రమాల బాధ్యతలు కూడా అధికంగా ఉన్నాయని ప్రస్తావించారు. బాధ్యతల కు అనుగుణంగా సిబ్బంది పెంపు లేకపోవడం వల్ల అధికారులపై పనిభారం పెరిగి రైతులకు అందాల్సిన సేవలపై ప్రభావం పడుతున్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి శాఖను బలోపేతం చేయాలని కోరారు. ఆయిల్‌పామ్, సూక్ష్మ నీటి పారుదల మరియు ఇతర కార్యక్రమాలకు బాధ్యతలకు అనుగుణంగా సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్రతి మండలానికి కనీసం ఒక ఉద్యాన విస్తరణ అధికారినీ, ప్రతి 2–3 మండలాలకు ఒక ఉద్యాన అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. 15, 20 ఏండ్ల నుంచి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యాన అధికారులకు శాఖా పదోన్నతి కమిటీ ద్వారా వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. క్షేత్ర పర్యటనలకు అనుగుణంగా ప్రయాణ భత్యం/వాహన భత్యం కల్పించాలని విన్నవించారు. కొత్త జిల్లాల్లో ఉద్యాన శాఖకు అవసరమైన కార్యాలయాలు, సిబ్బంది శాంక్షన్ చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో అవసరమైన పరిపా లనా, సాంకేతిక మరియు సహాయక సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యాన శాఖ బలోపేతం అనేది కేవలం ఉద్యోగుల సమస్య కాదనీ, ఇది రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సేవలు అందించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, నీటి వినియో గాన్ని తగ్గించడం, కూరగాయల ఉత్పత్తిని పెంచడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం వంటి ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్‌ ఐదో తేదీ వరకు అధికారులు సమస్యలను పరిష్కరించాలనీ, శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చట్టబద్ధ, శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -