Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి 

బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి 

- Advertisement -

శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలితక్క పోరాటం నేటి యువతకు ఆదర్శం కావాలి అని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ గానా కోకిల బెల్లి లలితక్క జయంతి సందర్భంగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లి లలితక్క ఆశయాలను నేటి యువతకు మరియు సమాజానికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుగులోత్ బాలాజీ, ఉపసర్పంచ్ రామగిరి సుమన్, వార్డ్ మెంబెర్స్ గొల్లపల్లి వేణు, పోరండ్ల గణేష్, జంజిరాల నరేష్, అంగోత్ పంతులు, నాయకులు సంద కృష్ణ,బెల్లి నర్సయ్య, సోమిరెడ్డి, మద్దెల సమ్మయ్య, పంజాల యాకన్నా, రామగిరి సంతోష్,పెంతల రాకేష్, సిబ్బంది రామగిరి ఉప్పలయ్య, వెంకన్న, బిక్షపతి, వెంకట్ నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -