Friday, August 14, 2026
E-PAPER
Homeఆటలుబ్రెజిల్‌‌తో మ్యాచ్‌‌కే మొగ్గు

బ్రెజిల్‌‌తో మ్యాచ్‌‌కే మొగ్గు

- Advertisement -

ఏసియన్‌ కప్‌ నుంచి తప్పుకున్న భారత్‌
న్యూఢిల్లీ : ఆల్‌ ఇండియా ఫుట్‌‌బాల్‌ ‌ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) ‌వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఫిఫా నిర్వహిస్తున్న ఏసియన్‌ ‌కప్‌‌లో పోటీపడకుండా… బ్రెజిల్‌‌తో స్వదేశంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌‌లో ఆడేందుకు మొగ్గుచూపింది. ఫిఫా తొలిసారి ప్రవేశపెట్టిన ఏసియన్‌ ‌కప్‌ ‌సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 6 ‌వరకు జరుగనుంది. కోల్‌‌కతా వేదికగా ఫుట్‌బాల్‌ అగ్రజట్టు బ్రెజిల్‌‌తో అక్టోబర్‌ 3‌న స్నేహపూర్వక మ్యాచ్‌‌కు ఏఐఎఫ్‌ఎఫ్‌ ‌గత నెలలో షెడ్యూల్‌ ‌ప్రకటించింది. ఫిఫా రూల్స్‌ ‌ప్రకారం జాతీయ జట్లు తొలి ప్రాధాన్య ఆటగాళ్లనే ఎంపిక చేయాలి. ఫిఫా అనుమతిస్తే ఏసియన్‌ ‌కప్‌‌లో ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దింపుదామని ఆలోచన చేసినా.. ఆ ప్రతిపాదనకు అనుమతి రాలేదు. దీంతో ఏసియన్‌ ‌కప్‌‌లో పోటీపడటం లేదని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత్‌‌పై ఫిఫా ఆర్థిక జరిమానా విధించే అవకాశాలు సైతం ఉన్నాయి. ఏసియన్‌ ‌కప్‌‌ డివిజన్‌ 1 ‌గ్రూప్‌ ఏలో ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌‌లతో పాటు భారత్‌ ‌పోటీపడాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఫిఫా టోర్నమెంట్‌‌లో పోటీపడే అవకాశం టీమ్‌ ఇండియా కోల్పోయింది. బ్రెజిల్‌‌తో స్నేహపూర్వక మ్యాచ్‌ అనంతరం ఇటీవల ఫిఫా ప్రపంచకప్‌‌లో పోటీపడిన ఇతర దేశాలతో ఫ్రెండ్లీ మ్యాచ్‌‌ల నిర్వహణపై ఏఐఎఫ్‌ఎఫ్‌ ‌కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -