Friday, August 14, 2026
E-PAPER
Homeఆటలుఆ ఉత్తర్వులు 
వెనక్కి తీసుకోండి

ఆ ఉత్తర్వులు 
వెనక్కి తీసుకోండి

- Advertisement -

కేంద్ర క్రీడాశాఖతో టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య
న్యూఢిల్లీ : సకాలంలో ఎన్నికల నిర్వహణలో వైఫల్యం, పరిపాలన పరమైన లోపాలతో భారత టేబుల్‌ ‌టెన్నిస్‌ ‌సమాఖ్య (టిటిఎఫ్‌ఐ) జాతీయ స్పోర్ట్స్‌ ‌ఫెడరేషన్‌ ‌గుర్తింపు రద్దు చేస్తూ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టిటిఎఫ్‌ఐ అధ్యక్షురాలు మేఘన అహ్లావత్‌ ‌కోరారు. టేబుల్‌ ‌టెన్నిస్‌ ‌సమాఖ్య ఒలింపిక్‌ ‌చార్టర్‌ ‌ప్రకారం స్వతంత్ర్యంగా పని చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సైతం ప్రభుత్వ జోక్యం సహించదు. క్రీడాశాఖ పాత్రపై మాకు గౌరవం. క్రీడాశాఖ షోకాజ్‌ ‌నోటీసులో లేవనెత్తిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించాం. జాతీయ క్రీడా సమాఖ్య హోదా గుర్తింపు రద్దు చేస్తూ తీసుకున్న ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మేఘన కోరారు. ఈ మేరకు క్రీడాశాఖకు టిటిఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ ‌లేఖ రాశారు. మేఘన 2022 నుంచి టిటిఎఫ్‌ఐ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆర్థిక అవకతకల ఆరోపణలతో ప్రధాన కార్యదర్శి కమలేశ్‌ ‌మెహతాను ప్రెసిడెంట్‌ సస్పెండ్‌ ‌చేయగా, అతడు ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ ‌చేశాడు. మేఘన హర్యానా మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ ‌చౌతాలా కాగా.. దుష్యంత్‌ ‌తండ్రి అజయ్‌ ‌సింగ్‌ ‌చౌతాలా గతంలో టిటిఎఫ్‌ అధ్యక్షుడిగా పని చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -