నవతెలంగాణ – మల్హర్ రావు
టిపిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడుగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ నియామకం అయ్యారని భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణకర్ గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణకర్,మాజీ అధ్యక్షుడు బడితేల రాజయ్య లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడుగా జంగిడి శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



