Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతలమయంగా రహదారులు  

గుంతలమయంగా రహదారులు  

- Advertisement -

నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు భాగంలో మెయిన్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చిన్నపాటి వర్షం వచ్చినా చాలు రోడ్డుపై నీళ్లు చెరువులా మారుతున్నాయి.

అదే విధంగా అపోలో మెడికల్ సమీపంలో, ఆత్మకూరు – మరికల్ వెళ్లే ప్రధాన రహదారిపై, మార్కెట్ సమీపంలో, ఎంపీడీవో కార్యాలయం సమీపంలో, పాత కరెంట్ ఆఫీస్ సమీపంలో మెయిన్ రోడ్డుపై పాత కరెంట్ ఆఫీస్ ముందు భాగం వెళ్లే అంతర్గత రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో వర్షపు నీరు చేరి ఏది గుంత, ఏది రోడ్డు అనేది తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు అవకాశం లేకపోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే చాలు రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయంగా మారిందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -