Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పతనం తప్పదు

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పతనం తప్పదు

- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 100 సీట్లు మించి బీజేపీకి రావు 
సిపిఐ జన చైతన్య ప్రచార యాత్రలో జిల్లా కార్యదర్శి బి విజయ సారధి 
బ్రాహ్మణ కొత్తపల్లి నెల్లికుదురు కాచికల్ రామన్నగూడెం నైనాల పార్వతమ్మ గూడెం కొనసాగిన ప్రచార యాత్ర 
నవతెలంగాణ-నెల్లికుదురు

వచ్చే ఎన్నికల్లో బిజెపి పతనం అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నాడు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6న ప్రారంభమైన సిపిఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర  నెల్లికుదురు మండలంలో బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అమరజీవి కొండపల్లి గోపాల్ రావు స్తూపం వద్ద నుండి ప్రారంభించారు. ఈ ప్రచార యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్ర బిజెపి సర్కార్ ప్రధాని మోడీ ప్రభుత్వానికి 100 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ బీహార్ లపై ఆధారపడి ఉన్న బిజెపి సర్కార్ వచ్చే ఎన్నికల్లో ఇక పతనం తప్పదు అన్నారు నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో మతాలు కులాలు విభజించి పరిపాలన సాగించాడన్నారు దేశంలో మోడీ పాలన గాడి తప్పిందన్నారు అమెరికాకే వత్తాసు పలుకుతూ సామ్రాజ్యవాద పెత్తనం చేస్తున్నాడన్నారు.

మోడీ పాలనలో విద్యార్థులు రైతులు కార్మికులు మహిళలు ఉద్యోగస్తులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు ఇటీవల జరిగిన బీహార్ మధ్యప్రదేశ్ ఎన్నికలే దానికి తార్కాణం అన్నారు. నరేంద్ర మోడీ ఆదాని అంబానీ లకే ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను మరిచిందన్నారు. గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు ధరల తగ్గించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని మోడీ పాలనలో ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చెందాడు.. అయోధ్యలో రాముని గుడి పేరుతో వందల కోట్ల రూపాయలు బిజెపి అకౌంట్లోకి వెళ్లాయనీ తెలిపాడు. దానిపై ఇంతవరకు ఎంక్వయిరీ వేయలేని మోడీ పరిపాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఘోరమైన పతనం మోడీకి తప్పదని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నెలకుదురు మండలంలో కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి అజయ్ సారధి రెడ్డి. మరియు నేతలు వరిపల్లి వెంకన్న, బైస స్వామి ,తూటి వెంకటరెడ్డి, చిర్ర సత్యనారాయణ, గార అనిల్, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, మామిళ్ల సాంబలక్ష్మి ,కట్లోజు పాండురంగా చారి ,చింతకుంట్ల వెంకన్న ,వెలుగు శ్రావణ్, మేక వీరన్న, కేదాసు రమేష్ ,ఎండి మహమూద్, నాగేల్లి యాకమ్మ ,ఎర్రోజు పద్మ ,నక్క నాగార్జున, యాస వెంకన్న ,రఫీ ,చీకటి సోమయ్య ,వినమల రవీందర్ ,పులి యాకయ్య ,మహేష్, మంద రవి, లచ్చన్న ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -