- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి తనిఖీలు చేపట్టింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. విశాఖ, హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు రూ.1.01 కోట్ల నగదు, 6 లగ్జరీ కార్లతో పాటు 182 బ్యాంకు ఖాతాలను, పలు కీలక పత్రాలను జప్తు చేశారు.
- Advertisement -



