హీరో నాని నటించిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. జడల్ క్యారెక్టర్ గురించి చెప్పగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ బాగా రిలేటబుల్‌గా, తెలిసిన ఒక పర్సన్ లాంటి ఫీలింగ్ వచ్చే రోల్స్. ఇందులో క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యుతో చూస్తారు. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్-సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వందకి రెండింతలు చేశాడు. శ్రీకాంత్-అనిరుధ్ కిల్లర్ కాంబినేషన్. వాళ్ల వల్లే ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల కట్ట’ లాంటి సాంగ్స్ సాధ్యమయ్యాయి.
శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్ బాబు అయితే బాగుంటుంది అని అన్నాడు. ఎందుకంటే చాలా నెగిటివ్, బ్రూటల్ క్యారెక్టర్. ఈ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు. ఇందులో విలన్‌గా ఆయన చేసే కొన్ని పనులు ఉంటాయి. అవన్నీ చూసి ఆడియన్స్ కచ్చితంగా షాక్ అవుతారు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చాలా ఎక్కువగా డ్యాన్స్ చేశాను. శ్రీకాంత్ దృష్టిలో నేను పెద్ద డ్యాన్సర్‌ని (నవ్వుతూ). నువ్వు డ్యాన్స్ చేస్తే మస్తు ఉంటది అన్న అని చెప్తుంటాడు. నేను డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. తన నమ్మకం నిజమైంది. పాటలు రిలీజ్ అయిన తర్వాత అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘ప్యారడైజ్’ అనే ప్లేస్‌లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథ ఇది. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం చేసిన ఒక తిరుగుబాటు. 1984-85 టైమ్‌లైన్ మధ్య ఉంటుంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అక్కడ చూపించిన వరల్డ్‌కి మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉన్న ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. * శ్రీకాంత్ ఒక ఆడియన్‌గా మాస్ కమర్షియల్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తాడు. తను మాస్‌ని ఒక దైవంలాగా భావిస్తాడు. శ్రీకాంత్ నరనరాల్లో మాస్ ఉంది. ఆ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఇందులో ఒక రెండు ఎపిసోడ్లు చాలా రాడికల్‌గా తీశాడు. నా ఫేవరెట్ ఎపిసోడ్స్. ఆడియన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్, షాక్ అవుతారు.
‘ప్యారడైజ్’ నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ యాక్షన్ బ్లాక్స్ ఉన్న సినిమా. ఫ్యూచర్‌లో కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చేస్తానేమో కానీ ఇంతకంటే ఎక్కువ కష్టపడను. ఎందుకంటే ఈ జడల వల్ల. ఈ జడలతో యాక్షన్ చేయడం అనేది ఎంత సమస్యగా ఉంటుందో ఊహించలేం. రాఘవ్ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ చాలా లైట్ హార్టెడ్‌గా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చాలా బ్రూటల్‌గా ఉంటాడు. ఇందులో రాఘవ్‌కి సంబంధించిన మూమెంట్ థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సంపూ బిర్యాని పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ స్టోరీ ఆర్క్ చాలా ఇంపార్టెంట్. అది చాలా సర్‌ప్రైజింగ్ రోల్. ఫైనల్ అవుట్‌పుట్, బిజినెస్ విషయంలో మా నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నారు. సోనాలి మదర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి తన బెస్ట్ ఛాయిస్. తనకు చాలా మంచి ప్రశంసలు వస్తాయి.
తల్లీ కొడుకుల భావోద్వేగాని కికనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



