మార్పును సంతరింపచేసుకోవటానికి, మనలో విజ్ఞాన సముపార్జన పెరగాలి అనేవారు ”డా.హిప్నో కమలాకర్’. దీని పట్ల మనకు యిచ్చిన బాధ్యతను మరింత పెంచుకోవాలి. జీవితాన్ని మరింత ప్రయోగ పూర్వకంగా మార్చుకోవాలి. మనలను నిలిపివేస్తున్న, పరిమితులు విధిస్తున్న నమ్మకాలను పరిశీలించాలి. మరింత ఎక్కువ ఆశావాదంతో కూడుకున్న పాజిటివ్ భావాలతో వాటిని భర్తీ చేయాలి.
ప్రాచీన కాలంలో మన చుట్టూ మార్పురావడం చాలా స్లోగా వుండేది. అంచేత మనుషులు మారుతున్న పరిస్థితులకనుగుణంగా మార్పు సంతరింపచేసుకోవటానికి కాస్త వ్యవధి దొరికేది. కానీ ఇపుడలా కాదు. మార్పు లేకుండా ఏదీ లేదు. ఇలా మారుతూ వుండటం ఒక్కటే స్థిరంగా వుంది. అంచేత ఈ వేగంతో పాటుగా మారటం అనేది కష్టమవుతుంది. ఫలితంగా మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారే స్వభావాన్ని ఏర్పరచుకోవడం ఒక సవాలుగా మారింది. దీనిని ట్రాన్సిషన్ మేనేజిమెంట్ అంటారు . ట్రాన్సిషన్ మేనేజిమెంట్ కనక లేకపోతే, మారుతున్న కాలం మనలను, బలవంతంగా మార్పునకు గురిచేస్తుంది. లేదా ఈ మార్పును తట్టుకోలేక మనం తీవ్రంగా నష్టపోతాం.
వేన్నీళ్ళలో కప్పలు :
రెండు కప్పలు ఒక టీ స్టాల్ వద్దకు గెంతుకుంటూ వచ్చాయి. ఒక కప్ప అక్కడున్న వేడినీటి కాగులో పడింది. నీళ్ళు కాలటంతో వెంటనే అది రియాక్ట్ అయి, బయటకు దూకి ప్రాణాల్ని దక్కించుకుంది. రెండో కప్ప ప్రక్కన పొయ్యి మీద అప్పుడే పెట్టిన నీటి కాగులో పడింది. నీళ్లు చల్లగానే వున్నాయి. అందుకే అది వెంటనే రియాక్ట్ కాలేకపోయింది. గిన్నె అడుగున సన్నగా మండుతున్న మంట, క్రమంగా నీటిని వేడెక్కించసాగింది. ఇది నెమ్మదిగా జరుగుతూ వుండటం వల్ల కప్ప, ముందున్న ప్రమాదం ఏమిటో గ్రహించలేకపోయింది. నీరు మరి కాస్త వెచ్చబడిన తర్వాత కూడా అది పెద్దగా చింతించలేదు. అలక్ష్యంగానే వుంది. నీరు మసలటం మొదలెట్టాయి. పైకి గెంతనూ లేక, లోపల వుండనూ లేక కప్ప గిలిగిలా తన్నుకుంది. వేడి ఎక్కువై అది చచ్చిపోయింది. ట్రాన్సిషన్ మేనేజ్మెంట్ తెలియకపోతే మన పరిస్థితి అంతే.
భవిష్యత్తులో మీరు విజయవంతంగా కొనసాగాలంటే మీలో ఎంతో మార్పు అవసరం. మిమ్మల్ని మీరు ఒక వ్యవస్థగా మార్పు చెందటానికి కావల్సిన అన్ని రంగాల్లోనూ మీరు, మీ దక్పథం మారాలి. టామ్ పీటర్స్ అన్నట్లుగా, ”మానవ జాతి పురోగతికి మార్పు ఒక విఘాతం కానేకాదు. మనిషి జీవించాలంటే, మనుగడ కొనసాగించి, పదికాలాలపాటు నిలవాలంటే మార్పును ప్రేమించాలి”. మీ పరిస్థితుల్లో మార్పురావాలంటే, మీలో మార్పు రావాలి. మీ వైఖరిలో మార్పు రావాలి. మీ చుట్టూ వున్న పరిస్థితుల్ని మార్చాలంటే మీరు మార్పుచెందాలి. మనందరికీ జీవితం సుఖమయంగా సాగాలి. మీరు కోల్పోయినదానిని రానున్న అయిదేళ్ళ కాలంలో భర్తీ చేయాలంటే మీ జీవితంలో కొన్ని మార్పులను చేసుకోవడానికి సిద్ధం కావాలి. మార్పునకు దోహదపడే సూత్రాలను అనుసరించాలి.
మార్పునకు సంసిద్ధం కావడానికి, మనలో విజ్ఞాన సముపార్జన పెరగాలి అంటాడు. మిక్కిపార్శన్ దీని పట్ల మనకు యిచ్చిన బాధ్యతను మరింత పెంచుకోవాలి. జీవితాన్ని మరింత ప్రయోగపూర్వకంగా మార్చుకోవాలి. మనలను నిలిపివేస్తున్న, పరిమితులు విధిస్తున్న నమ్మకాలను పరిశీలించాలి. మరింత ఎక్కువ ఆశావాదంతో కూడుకున్న పాజిటివ్ భావాలతో వాటిని భర్తీ చేయాలి. మార్పు ఒత్తిడికి కారణమవుతుంది. ఉత్కంఠను రేపే పాజిటివ్ మార్పులు సైతం మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. అంచేత, ఈ పాజిటివ్ వైఖరితో పాటు ఉద్వేగాలకు సైతం మరింత తులనాత్మకతను ఏర్పరచుకోవాలి. అసంతప్తి, కోపం, డిప్రెషన్ వంటివి ఏర్పడుతూ వున్నాయంటే, అవి ‘మార్పు’ అందిస్తున్న ప్రతిఫలాలను స్వీకరించలేని మీ వైఖరిని బయట పెడుతున్నాయని గ్రహించాలి.
కొన్ని సూచనలు :
రోజూ మీరు చేసేపనులను, మీకు వచ్చే మనోభావాలను ఒక పుస్తకంలో రాసుకోండి.
ఇతరులందరినీ, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను తరచుగా కలుస్తూ వుండటానికి ప్రయత్నించండి.
టైం మేనేజ్మెంట్ నిపుణతతో నిర్వర్తించండి. వాస్తవికమైన ప్రయారిటీలను తెలుసుకోండి.
మీ జీవితాన్ని సరళీకతపరిచే వాటిని, మీరు చేసే పనులను సరళీకతం చేసే వారిని ఎన్నుకొని ఒక లిస్టుగా రాసుకోండి.
అప్పుడప్పుడు రిలీఫ్‌కోసం ఏదో ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని సందర్శించండి.
మీ మైండ్‌ను బాడీని స్పిరిట్ని ఉత్సాహపరిచే వైపుగా ఒక కొత్త హాబీని అలవర్చుకోండి.
మీరు సహించలేని వాటిని ఒక లిస్టుగా రాసుకోండి. క్రమంగా వాటి సంఖ్యను తగ్గించుకోండి.
మీరు కోల్పోతున్న అంశాలను కూడా ఇట్లాగే లిస్టుగా రాసుకోండి. తులనాత్మకతను సాధించడానికి కషిచేయండి
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



