నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం దేవాదుల ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చేరుకుంటారు. కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ చైర్మెన్ వెన్నం విజయ్ కాంత్రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించగా, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం రెడ్యాల గ్రామానికి వెళ్ళనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రెడ్యాల నుంచి బయలుదేరి 3.30కు దేవాదుల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ను పరిశీలించి అనంతరం ఇంజినీర్లతో సమీక్ష నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
నేడు ‘దేవాదుల’ను సందర్శించనున్న సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



