Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలురీల్స్ మోజులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి

రీల్స్ మోజులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో రీల్స్ చిత్రీకరిస్తూ ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమిత్ నాయక్, సంజయ్ కుమార్ అనే యువకులు వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. రాత్రి శుభ్రం చేస్తుండగా, నీటి పైపుతో రీల్స్ తీస్తూ హై వోల్టేజ్ విద్యుత్ వైర్లకు నీటిని కొట్టడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి సుమిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో సంజయ్ కూడా విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. స్థానికులు, తోటి కార్మికులు స్పందించి సంజయ్‌ను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -