- Advertisement -
హైదరాబాద్ : టీజీ20లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ర్టయికర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లు అజయ్‌దేవ్ గౌడ్ (4/21), యశ్‌వీర్ గౌడ్ (2/15), ప్రణవ్ వర్మ (2/25) దెబ్బకు పాలమూరు స్ర్టయికర్స్ తొలుత 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గణేశ్ (50 నాటౌట్) అజేయ అర్థ సెంచరీలతో ఈ చాంపియన్స్ 15.4 ఓవర్లలోనే 147 పరుగులు చేసింది.
- Advertisement -



