విద్యార్థులకు గుడ్ న్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. మొత్తం 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. అయితే ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం సమ్మర్ హాలీడేస్ ఇంకా పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ త్వరలోనే అపిషీయల్‌గా అనౌన్స్‌మెంట్ చేయనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నారు. జూన్ 13 న స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. సమ్మర్ హాలీడేస్ పొడగింపుపై వార్తలు విన్న విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.

Spread the love