Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసమ్మెబాట పట్టిన 25 వేలమంది క్యాబ్‌డ్రైవర్లు

సమ్మెబాట పట్టిన 25 వేలమంది క్యాబ్‌డ్రైవర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో క్యాబ్ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నుంచి దాదాపు 25,000 మంది క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేపట్టారు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్‌పోర్ట్ ట్రిప్పులను డ్రైవర్లు పూర్తిగా బహిష్కరించారు.

ప్రభుత్వం 2022 డిసెంబర్ 9న జారీ చేసిన జీవో 46ను తక్షణమే అమలు చేయాలన్నది డ్రైవర్లు ప్రధాన డిమాండ్. ఈ జీవో ప్రకారం, ఎయిర్‌పోర్ట్ ప్రీపెయిడ్ సర్వీసులకు కిలోమీటరుకు రూ. 21 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం తమకు కిలోమీటరుకు కేవలం రూ. 12 నుంచి రూ. 15 మాత్రమే అందుతున్నాయని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆరోపించారు.

ఈ అంశంపై ఆగస్టు 31న కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు, కంపెనీల యాజమాన్యాలతో కీలక సమావేశం జరిగింది. జీవో నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాలని అధికారులు ఆదేశించినప్పటికీ, సదరు కంపెనీలు వాటిని బేఖాతరు చేశాయని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -