– కలెక్టర్ కె. హైమావతి
నవతెలంగాణ-కోహెడ
మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను శనివారం కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్ణీత కాలవ్యవధిలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో అధునాతన సాంకేతిక విధానమైన మై-వన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్య ప్రకృతి రమణీయ వాతావరణంలో నిర్మితమవుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ విద్యాసంస్థగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



