Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరుస దొంగతనాల ఛేదనలో ప్రతిభ.. 

వరుస దొంగతనాల ఛేదనలో ప్రతిభ.. 

- Advertisement -

పోలీసులకు సీపీ అభినందనలు
నవతెలంగాణ – కోహెడ 

కోహెడ మండల పరిధిలో వరుసగా జరిగిన దొంగతనాలు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ చోరీ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను శనివారం పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అభినందించారు. నిందితులను గుర్తించి పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్, కోహెడ హెడ్ కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్ జి. వేణు, హోంగార్డు లింగస్వామిలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ‘సీపీ కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేరాల నియంత్రణకు మరింత కృషి చేయాలని సూచించినట్లు ఎస్సై అభిలాష్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -