ఐసిడిఎస్ నెల్లికుదురు సూపర్వైజర్ సరిత
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని హాస్టల్లో పోషణ మాసంలో భాగంగా కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత తెలిపారు. శనివారం హాస్టల్ వార్డెన్ హెచ్ అనిత తో కలిసి హాస్టల్లో ఉన్న పిల్లలకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికలు ఆరోగ్యం పై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే విధంగా బోధించడం చెప్పారు. పోషణ మాసంలో భాగంగా కిశోర బాలికలకు పొదుపుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు అంగన్వాడీ టీచర్లు ఐ పద్మ ,కె పద్మ, పి జ్యోతి ,ఎం పద్మ, కె మాధవి, హాస్టల్ వార్డెన్ హెచ్ అనిత, సిఏ నసిహతు బేగం, ఆశ వర్కర్ మయా స్వరూప ,తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణకొత్తపళ్లిలో అంగన్వాడి ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ మాసంలో భాగంగా కిషోర్ బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ గ్రామ అంగన్వాడీ టీచర్లు పెరుమాండ్ల శ్రీ జ్యోతి ఎం కవిత తెలిపారు. శనివారం ప్రభుత్వ పాఠశాలలో కిశోర బాలికలకు వారి కావాల్సిన వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిశోర బాలికలు ఆరోగ్యం వంతంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీలో నుంచి సూచనల మేరకు ఉండాలని అంతేకాకుండా కిశోర బాలికలు పొదుపు కూడా అలవాటు నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉష ఆయాలు పుటకల లచ్చమ్మ, మాదగాని వెంకటమ్మ , దాసరి రేణుక తదితరులు పాల్గొన్నారు.



