నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాజెక్టు పురోగతిపై ఈరో ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆయన చర్చించారు.
ఈ భేటీలో ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ (JUA) అభివృద్ధికి రక్షణ మంత్రిత్వ శాఖ సంపూర్ణ సమ్మతి తెలిపినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్ పురోగతిని వేగవంతం చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చే వారంలోగా ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు.


