- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో 20వేల పోలీస్ ఉద్యోగాల ఖాళీలు ఉంటే.. 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావాలని సీఎం అంటున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని సీఎం అంటున్నారని, ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్లారా అని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు.
- Advertisement -


