హీరో సుమంత్ నటించిన డివోషనల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ డివైన్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుమంత్ మాట్లాడుతూ, ‘చాలా కాలంగా కొంతమంది ఇండస్ట్రీ పీపుల్, అలాగే నా ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుకోలేదు. నిన్నటి నుంచి ఆ అభినందనలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి ప్రేక్షకులు, అభిమానులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి చాలా మంచి కాల్స్ వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో టాక్ చాలా పాజిటివ్‌గా ఉంది. పికప్ కావడానికి టైం పట్టింది, అది వాస్తవమే. ఇప్పుడు మంచి టాక్ సెటిల్ అయింది. ఈ సినిమాకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మేము చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో అనే ఒక చిన్న భయం ఉండేది. వాటిని చాలా ఎంజాయ్ చేశారు’ అని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి తెలిపారు. నిర్మాత మధు మాట్లాడుతూ, ‘మేము ఊహించినట్టే ప్రతి షోకి సేల్స్ పెరుగు తున్నాయి. కృష్ణా, ఈస్ట్, వైజాగ్, తిరుపతి, నైజాం అన్నిచోట్ల ఫుల్స్ వచ్చాయి. ఇప్పుడు 75 స్క్రీన్స్ పెంచాము. అలాగే ఒడిశాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే హిందీలో కూడా మెల్లగా పికప్ అవుతుంది’ అని అన్నారు.
మౌత్ టాక్ చాలా బాగుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



