Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమన అందరి కథ..

మన అందరి కథ..

- Advertisement -

గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై రూపొందుతున్న సినిమా ‘హ్యాపీ జర్నీ’. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా తమ పాత్రల్లో విభిన్న వ్యక్తిత్వాలు, ఎమోషన్స్‌ను చూపించారు. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా.. నటీనటులు తమ పాత్రలకు సహజత్వం, ఆకర్షణను తీసుకొచ్చారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిరామ్ నాయుడు మాట్లాడుతూ, ‘మన పేరెంట్స్ మీద మనకి చాలా ప్రేమ ఉంటుంది. కాకపోతే దాన్ని చూపించుకునే విధానం చాలా తక్కువ. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో చూపిస్తాం. నిజంగా జనాభా పెరిగితే ఒకరికొకరు తోడు పెరగాలి. కానీ మనం వంటరి అవుతున్నాను. ఫోన్ నెంబర్లు ఉంటాయి. కానీ ఎవరికీ ఫోన్ చేయలేని పరిస్థితి. ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఇందులో ఏడుగురు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే మహిళల జర్నీని మీరు చూస్తారు. మా నిర్మాతలు కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు థాంక్యూ. శేఖర్ చంద్ర మీనింగ్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు. ఎందుకంటే ఇది మన అందరి కథ. సినిమా అంతా చాలా ఫన్ ఉంటుంది. చివర్లో చాలా మంచి పాయింట్ కూడా ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -